మై విలేజు - కాన్సెప్ట్ డ్రైవ్ 2022 - 23 ఒక సరికొత్త భావన గా ఆవిష్కరించ బడుతుంది. గ్రామాలను పట్టణాలు, నగరాలు మరియు మెట్రోపాలిటన్లతో అనుసంధానిస్తు ఒక సామాజిక అమ్మకపు వేదికను సృష్టించడం జరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు , సేంద్రియ మరియు చిరు ధాన్యాల ఉత్పత్తులు, పాలు, గుడ్లు మరియు మాంసోత్పత్తులు, స్వయం ఉపాధి వ్యక్తులు మరియు స్వయం సహాయక బృందాలలో నిమగ్నమైన రైతులందరికీ వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఉపయోగపడే పబ్లిక్ బ్రాండుని సృష్టించడం మై విలేజు - కాన్సెప్ట్ డ్రైవ్ 2022 - 23 యొక్క ప్రధాన ఉద్దేశ్యము.
గ్రామ పునర్నిర్మాణానికి ఎన్నుకున్న అంశాలు :
1. నీటి యాజమాన్యం.
2. విత్తన యాజమాన్యం.
3. పశు పక్షాదుల నిర్వహణ, పశుగ్రాసం మరియు వాటి ఉత్పత్తులను ఆదాయ వనరులుగా విశ్లేషించడం.
4. గ్రామీణ ఉత్పత్తులు, వినియోగం లెక్కగట్టి, నూతన పద్దతిలో గ్రామీణ మార్కెట్ ప్లేస్ లు మరియు గ్రామోత్పత్తులు సులభంగా అమ్ముకునే వేదికను స్పృష్టించడము.
5. అడవుల పెంపకం మరియు జీవ వైవిధ్యం.
6. పశు పోషణ, పశు గ్రాసం, వాటి ఉత్పత్తులు ఆదాయ మార్గాలను స్పృష్టించడము.
7. గ్రామంలో రైతు చేసుకోగలిగే యంత్రాల ఆవిష్కరణలతో కలుపు సమస్యలు, వ్యవసాయ పనిలో మనుషుల కొరతను అధిగమించడం,
8. నాణ్యత ప్రమాణాలు, విలువ జోడింపు.
9.రైతు ఉత్పత్తి దారుల సంఘముల ఏర్పాటుకు కృషి, సేంద్రియ ఉత్పత్తికి ధ్రువీకరణపై అవగాహన,
10.రైతు సేవలకు ఉన్న అవకాశాలను జత చేసి మీ-సేవ, ఈ-సేవ లాగా రైతు-సేవ లాంటి ఉపాధి లభ్యత పై దృష్టి.
11.యంత్రాలు వాటి పని తీరు
12. ఆహార ప్రాసెసింగ్ కేంద్రాలు
13.రైతులు- ప్రభుత్వ పథకాలు
14.ఉపాది హామీ పథకం ను ఎలా రైతులు ఉపయోగించు కొవచ్చును.
15.కిసాన్ క్రెడిట్ కార్డు & యితర ఋణ సదుపాయాలు
ఇలా ఎంచుకున్న అంశాలపై, గ్రామం పునర్నిర్మాణంపై ఆసక్తి ఉన్న వ్యక్తుల వేదిక గా ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థ ప్రణాళిక బద్దంగా పని చేస్తుంది.
1. మొదటగా పై అంశాలపై అధ్యయనం,
2 .ఆసక్తి, నైపుణ్యం,సామర్థ్యం ఉన్న వారిని గుర్తించడం,
3. ఆచరణకు సాధ్యం అయ్యే నూతన విధానాలపై చర్చలు,
4. జీవనోపాదిగా మల్చుకునే వారికి వనరుల పరిచయం, ఆధునిక విజ్ఞానం, టెక్నాలజీ అందించే సంస్థల తో సమన్వయ పరచడం.
5. డబ్బు దుర్వినియోగం కాకుండా గ్రామ స్వావలంబన దిశగా ఒకరికొకరం సహాయం అందించుకోవడం.
'భారతదేశం యొక్క భవిష్యత్తు దాని గ్రామాలలో
వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ అనేది రైతులు తమ మిగులు ఉత్పత్తులను సరసమైన మరియు సహేతుకమైన ధరకు అమ్ముకోగలిగిన సమ
వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమాలు ఒక వ్యక్తి తన వ్యవస్థాపక ఉద్దేశ్యాన్ని బలోపేతం చేయడంలో మరియు అతని వ్యవస్థ